ఉత్సాహంగా తానా న్యూజెర్సీ ‘హైకింగ్‌-2

New Jersey USA

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హైకింగ్‌-26’ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. “చక్కటి ఆరోగ్యం ఒక్క అడుగుతోనే ప్రారంభం” (Better Tomorrow Begins with a Step) అనే నినాదంతో జూలై 11న శనివారం ఉదయం 8 గంటలకు హిల్స్‌బరో టౌన్‌షిప్‌లోని సౌర్‌లాండ్ మౌంటెన్ హైకింగ్ ట్రయిల్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగిన ఈ వనవిహారంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రవాస తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్రకృతి అందాల మధ్య ఉత్సాహంగా అడుగులు వేశారు.

ఆహ్లాదకరంగా సాగిన ట్రయిల్..
స్వాగత పరిచయ కార్యక్రమముల తదనంతరం నిర్వాహకులు ముందుగా హైకింగ్ మార్గం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వేసవిలో పాటించాల్సిన భద్రతా సూచనలను వివరించారు. అనంతరం అందరూ కలిసి గ్రూప్ ఫొటో దిగి ట్రయిల్‌పై నడక ప్రారంభించారు. న్యూజెర్సీలోని పచ్చని ప్రకృతి ప్రదేశాల్లో ఒకటైన సౌర్‌లాండ్ మౌంటెన్ ప్రిజర్వ్.. దట్టమైన చెట్లు, బండరాళ్లు, పక్షుల కిలకిలారావాలతో పాల్గొన్న వారికి సరికొత్త అనుభూతిని పంచింది. కుటుంబ సమేతంగా వచ్చినవారు చిన్నారులతో కలిసి నడుస్తూ, కొత్త పరిచయాలతో , ప్రకృతి దృశ్యాలను ఫొటోల్లో బంధిస్తూ ఆనందంగా గడిపారు. తొలిసారి హైకింగ్‌కు వచ్చినవారు సైతం అనుభవజ్ఞుల ప్రోత్సాహంతో ట్రయిల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.

పకడ్బందీ ఏర్పాట్లు.. భద్రతకు పెద్దపీట
ఈ కార్యక్రమం కోసం తానా న్యూజెర్సీ బృందం పలు వారాల పాటు శ్రమించి ముందస్తు ప్రణాళికతో ఏర్పాట్లు చేసింది. ఊహించిన దానికంటే అధిక స్పందనకు 200 కు పైగా సభ్యులు రావడంతో పార్కింగ్‌, ట్రయిల్ మార్గదర్శనం, వాటర్ స్టేషన్లు, వలంటీర్ల సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారించారు. నడక ప్రారంభానికి ముందు వార్మప్ వ్యాయామాలు చేయించడంతో పాటు, ట్రయిల్ పొడవునా వాటర్ స్టేషన్లు, ప్రథమ చికిత్సా సదుపాయాలు ఏర్పాటు చేశారు. అనుభవజ్ఞులైన వలంటీర్లు బృందాలుగా విడిపోయి, ఎవరూ వెనుకబడిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *