సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన: 1 లక్ష ఇందిరమ్మ ఇళ్లు, 22ఏ భూములపై కీలక నిర్ణయం!

 సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పట్టణ పేదల సొంతింటి కలను నిజం చేసే దిశగా కీలక అడుగులు వేశారు. గురువారం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో కోర్ అర్బన్ (CURE) ప్రాంత పరిధిలో నిర్మించనున్న ‘ఇందిరమ్మ ఇండ్లు (టవర్స్)’ నిర్మాణానికి ఆయన లాంఛనంగా శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో పేదలను ఏ విధంగా మోసం చేసిందో ఈ […]

Continue Reading

హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం..!

హైదరాబాద్ నగరాన్ని వరద ముప్పు నుంచి కాపాడటానికి, చెరువులను ఆక్రమణదారుల నుంచి విముక్తి చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో ‘హైడ్రా’ (HYDRAA) వ్యవస్థను ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన తొలి రోజుల్లోనే అనేక అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ సంచలనం సృష్టించిన ఈ సంస్థ, ప్రస్తుతం ఒక కీలకమైన న్యాయపోరాటాన్ని ఎదుర్కొంటోంది. సల్కం చెరువు పరిధిలోని ఆక్రమణలపై చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడంతో తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు నోటీసులు […]

Continue Reading

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర పరిణామం!

ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కేసులో అనుబంధ అభియోగపత్రం దాఖలు చేసేందుకు సిట్ సిద్దమైన పరిస్థితుల్లో ఓ విశ్రాంత డీజీపీ (DGP)తో పాటు మరో డీజీ (DG) ని సాక్షులుగా చేర్చే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలిసింది. న్యాయస్థానంలో విచారణ సమయంలో వారి వాంగ్మూలాలే కేసును మలుపు తిప్పే అవకాశముండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వారిలో ఒకరు సుదీర్ఘకాలం పోలీస్‌శాఖలో డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందగా, మరొకరు […]

Continue Reading

అత్యంత విషమంగా వైద్య విద్యార్థిని ప్రియాంక పరిస్థితి

రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రి (KIMS Hospital)లో చికిత్సపొందుతున్న వైద్య విద్యార్థిని ప్రియాంక (Priyanka) ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రియాంకకు ఆప్నియా టెస్ట్ చేయడానికి వైద్యులు ప్రయత్నించగా, ఆమె శరీరం సహకరించకపోవడంతో విరమించుకున్నారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆమె తల్లిదండ్రులతో వైద్యులు చర్చించారు.తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాల (GSL Medical College)లో కర్నూలుకు చెందిన ప్రియాంక డెర్మటాలజీ విభాగంలో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. […]

Continue Reading

బనకచర్లకు బ్రేక్.. రేవంత్ రెడ్డి విజయమేనా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పోలవరం–బనకచర్ల నదీ అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన నిపుణుల అప్రైజల్ కమిటీ తిరస్కరించి వెనక్కి పంపడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఈ నిర్ణయం వెలువడిన వెంటనే రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా వేడి రాజుకుంది. దీన్ని సీఎం రేవంత్ రెడ్డి సాధించిన విజయంగా కాంగ్రెస్ శ్రేణులు జోరుగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే ఈ రాజకీయ క్రెడిట్ వార్ వెనుక ఉన్న సాంకేతిక, చట్టపరమైన […]

Continue Reading