WhatsAppకి ఇప్పుడు మీ వయసుతో ఏం పని? కొత్త మెసేజ్ వెనుక అసలు కథ ఇదే!

Technology

WhatsApp ఓపెన్ చేస్తే… “మీ పుట్టిన తేదీ (Date of Birth) నమోదు చేయండి” అనే కొత్త మెసేజ్ కనిపిస్తే ఆశ్చర్యపడకండి. ప్రస్తుతం భారత్‌లో కొంతమంది వినియోగదారులపై WhatsApp ఈ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది.

అసలు WhatsApp మీ పుట్టిన తేదీ ఎందుకు అడుగుతోంది? దీనికి కారణం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం. ఈ చట్టం ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని నిర్వహించే డిజిటల్ సేవలు, వారి వయసును నిర్ధారించడానికి చర్యలు తీసుకోవాలి. అందుకే WhatsApp ఈ కొత్త విధానాన్ని పరీక్షిస్తోంది.

అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పటికైతే ఒక టెస్ట్ ఫీచర్ మాత్రమే. పుట్టిన తేదీ నమోదు చేయకపోయినా WhatsApp యథావిధిగా పనిచేస్తుంది. అలాగే మీరు ఇచ్చే వయసు సమాచారాన్ని ఇతర WhatsApp వినియోగదారులతో పంచుకోబోమని Meta స్పష్టం చేసింది.

దీనివల్ల సాధారణ వినియోగదారులకు పెద్దగా మార్పేమీ ఉండకపోవచ్చు. కానీ 18 ఏళ్లలోపు పిల్లలకు మరింత భద్రత, మెరుగైన ప్రైవసీ రక్షణ కల్పించడానికి ఈ సమాచారం ఉపయోగపడే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ కొంతమందికే అందుబాటులో ఉంది. కానీ భారత్‌లో కొత్త డిజిటల్ చట్టాలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఇలాంటి మార్పులు మరిన్ని డిజిటల్ సేవల్లో కనిపించే అవకాశం ఉంది.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *