తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.10.2 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వరుణ్ తేజ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచిన ‘కొరియన్ కనకరాజు’

Movies

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో అదరగొట్టారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.10.2 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ప్రీమియర్స్ కలుపుకుని వచ్చిన ఈ వసూళ్లతో వరుణ్ తేజ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్‌గా నిలిచింది.

పెయిడ్ ప్రీమియర్స్ నుంచే సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా కామెడీ, హారర్ అంశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. అదే టాక్ తొలి రోజు థియేటర్లలో కనిపించింది. అర్బన్ సెంటర్లతో పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలోనూ ఆక్యుపెన్సీ అద్భుతంగా వుంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న మౌత్ టాక్ సినిమాకు మరింత కలిసొస్తోంది.

‘కొరియన్ కనకరాజు’లో కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఉండటం సినిమాకు ప్రధాన బలంగా మారింది. భయపెట్టే సన్నివేశాలతో పాటు నవ్వించే ఎపిసోడ్స్‌తో సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారు. దీంతో సినిమా గురించి వస్తున్న పాజిటివ్ టాక్ ఇప్పుడు బుకింగ్స్‌పై కూడా మంచి ప్రభావం చూపిస్తోంది.

ఇక రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా సినిమాకు మంచి జోష్ ఇస్తున్నాయి. బుక్‌మైషో, డిస్ట్రిక్ట్ యాప్‌ రెండింటిలో కలిపి ఇప్పటికే 2.5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. బుకింగ్స్ ఇంకా కొనసాగుతుండటంతో వీకెండ్‌లో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

ఓవర్సీస్‌లోనూ సినిమా మంచి ఆరంభాన్ని అందుకుంది. అమెరికాలో $175Kకు పైగా గ్రాస్ సాధించి నార్త్ అమెరికాలోనూ స్ట్రాంగ్ ఓపెనింగ్ నమోదు చేసింది.
ముఖ్యంగా పాజిటివ్ మౌత్ టాక్ సినిమాకు పెద్ద ప్లస్‌గా మారింది. సోమవారం బోనాల పండుగ సెలవు కూడా ఉండటంతో అదనపు ఫుట్‌ఫాల్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఎక్స్‌టెండెడ్ వీకెండ్‌ను ‘కొరియన్ కనకరాజు’ సద్వినియోగం చేసుకోనుంది.

What do you feel about this post?

0%
like

Like

0%
love

Love

0%
happy

Happy

0%
haha

Haha

0%
sad

Sad

0%
angry

Angry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *