ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే సంకల్పంతో ‘టాక్సిక్’ చేశాం. సినిమా ఖచ్చితంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది: ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో రాకింగ్ స్టార్ యశ్
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ట్రైలర్ విడుదలైంది. రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ట్రైలర్.. అధికారం, ప్రేమ, ద్రోహం, ప్రతీకారం చుట్టూ తిరిగే ఓ భారీ గ్యాంగ్‌స్టర్ ప్రపంచాన్ని పరిచయం చేసింది. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు, అబ్బురపరిచే విజువల్స్, బలమైన క్యారెక్టర్లతో ‘టాక్సిక్’ ఒక భారీ యాక్షన్ మాగ్నమ్ ఓపస్‌గా కనిపిస్తోంది.
ఈ కథలో రాయా, అతని కుమారుడు మధ్య ఉండే సంక్లిష్టమైన సంబంధం ప్రధాన భావోద్వేగంగా కనిపిస్తోంది. తండ్రి, కొడుకుల మధ్యే సంఘర్షణకు దారితీసే పరిస్థితులు ఆసక్తిని పెంచుతున్నాయి. మరోవైపు నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి పాత్రలు కూడా కథలో కీలకంగా కనిపిస్తున్నాయి. ప్రతి పాత్రకు ప్రత్యేకమైన షేడ్స్ ఉండటంతో ఈ గ్యాంగ్‌స్టర్ ప్రపంచం మరింత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది.
https://googleads.g.doubleclick.net/pagead/ads?client=ca-pub-3422284713546733&output=html&h=280&slotname=9301014755&adk=3447344571&adf=2630705981&pi=t.ma~as.9301014755&abgtt=6&w=719&fwrn=4&fwrnh=100&lmt=1786250618&rafmt=1&format=719×280&url=https%3A%2F%2Fwww.telugutimes.net%2Fcinema%2Fcinema-news%2Frocking-star-yashs-toxic-trailer-out-403262.html&fwr=0&fwrattr=true&rpe=1&resp_fmts=3&aiof=10&asro=0&aimartd=4&aieuf=1&aicrs=1&uach=WyJXaW5kb3dzIiwiMTAuMC4wIiwieDg2IiwiIiwiMTUwLjAuNzg3MS4xMTQiLG51bGwsMCxudWxsLCI2NCIsW1siTm90O0E9QnJhbmQiLCI4LjAuMC4wIl0sWyJDaHJvbWl1bSIsIjE1MC4wLjc4NzEuMTE0Il0sWyJHb29nbGUgQ2hyb21lIiwiMTUwLjAuNzg3MS4xMTQiXV0sMF0.&dt=1786250617226&bpp=3&bdt=400&idt=870&shv=r20260805&mjsv=m202608050101&ptt=9&saldr=aa&abxe=1&cookie_enabled=1&eo_id_str=ID%3D642a94b804b1d289%3AT%3D1785511499%3ART%3D1786250074%3AS%3DAA-AfjYFUU5IchFnVwjR1cA_pAVX&prev_fmts=0x0%2C379x250%2C728x90&nras=1&correlator=6417130816865&frm=20&pv=1&u_tz=330&u_his=1&u_h=864&u_w=1536&u_ah=824&u_aw=1536&u_cd=24&u_sd=1.25&dmc=8&adx=0&ady=1603&biw=1521&bih=703&scr_x=0&scr_y=0&eid=95396139%2C95397133%2C122880126%2C122880219&oid=2&pvsid=4362094914379074&tmod=1663481573&uas=0&nvt=1&ref=https%3A%2F%2Fwww.telugutimes.net%2Flifestyle%2Fdaily-habits-to-reduce-knee-pain-simple-ways-402974.html&fc=1920&brdim=0%2C0%2C0%2C0%2C1536%2C0%2C1536%2C824%2C1536%2C703&vis=1&rsz=%7C%7CEebr%7C&abl=CS&pfx=0&fu=128&bc=31&plas=389x632_r&bz=1&ifi=3&uci=a!3&btvi=2&fsb=1&dtd=880
అవార్డు విన్నింగ్ దర్శకురాలు గీతు మోహన్‌దాస్ తనదైన టేకింగ్, విజువల్ స్టైల్‌తో ‘టాక్సిక్’ ప్రపంచాన్ని పూర్తిగా డిఫరెంట్‌గా రూపొందించినట్లు ట్రైలర్ చెబుతోంది. ముఖ్యంగా యశ్ వర్సెస్ యశ్ అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్ ట్రైలర్‌కు అతిపెద్ద హైలైట్‌గా నిలిచింది. రాయా, టికెట్ పాత్రల్లో యశ్ తండ్రి, కొడుకులుగా రెండు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తున్నారు. యశ్ యాక్షన్‌లోని ఇంటెన్సిటీ, స్టైల్, వైల్డ్నెస్ ప్రతి ఫ్రేమ్‌లోనూ అడ్రినలిన్ రష్ పుట్టించేలా ఉన్నాయి.
భారీ యాక్షన్ సీక్వెన్సులు, థ్రిల్లింగ్ మూమెంట్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, డార్క్ అండ్ టెక్చర్డ్ విజువల్స్‌తో ‘టాక్సిక్’ ప్రపంచాన్ని ట్రైలర్ చాలా గ్రాండ్‌గా చూపించింది. యాక్షన్‌తో పాటు ఎమోషన్, రిలేషన్షిప్స్, క్యారెక్టర్ డైనమిక్స్‌కు కూడా సమానమైన ప్రాధాన్యత ఇచ్చారు.
ఇంగ్లిష్, కన్నడ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్స్‌లో విడుదల కానుంది. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యశ్, నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన ‘టాక్సిక్’ ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
బెంగళూరులో గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ట్రైలర్ అద్భుతంగా ఉంది. మేమందరం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. యశ్ నాకు బ్రదర్ లాంటివాడు. తను ప్రతి సినిమాతో ఎదుగుతుండటం నాకు చాలా ఆనందంగా ఉంది. తను అద్భుతంగా ముందుకు వెళ్తున్నాడు. తనకు మరెన్నో విజయాలు రావాలని కోరుకుంటున్నాను. కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు ఆల్ ది వెరీ బెస్ట్. డైరెక్టర్ గారు ఫెంటాస్టిక్ విజువల్స్ అందించారు. ప్రతి అంశం మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్”.
రాకింగ్ స్టార్ యశ్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్ కోసం కర్ణాటకకు వచ్చిన ప్రతి ఒక్కరికీ, మీడియా మిత్రులకు, అతిథులకు అందరికీ ధన్యవాదాలు. ఇది నా సినిమా కాదు.. ఇది ఇండియన్ సినిమా. ఎంతోమంది ప్రతిభావంతులు కలిసి ఈ సినిమాను రూపొందించారు. ఇండియన్ సినిమాను గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై నిలబెట్టాలనే సంకల్పంతో ఈ సినిమా చేశాం. ఈ సినిమాను కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో చిత్రీకరించాం. ఇది చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమా కోసం ఎంతోమంది హార్డ్ వర్క్ చేశారు. ప్రతి ఒక్కరూ ఎంతో ప్యాషన్‌తో పనిచేశారు. గీతు మోహన్‌దాస్ చాలా అద్భుతమైన, ప్యాషనేట్ డైరెక్టర్. ఈ సినిమా కోసం ఆమె ఎన్నో త్యాగాలు చేశారు. ఎంతో అంకితభావంతో పనిచేశారు. ఈ సినిమా కచ్చితంగా గుర్తుండిపోతుంది. ఆమె విషయంలో ప్రతి ఒక్కరూ చాలా గర్వపడతారు. ఇలాంటి సినిమా చేయడం మామూలు విషయం కాదు. నిర్మాత వెంకట్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు. మాకు కావాల్సిన ప్రతిదీ సమకూర్చారు. దాదాపు 200 రోజుల పాటు రెండు భాషల్లో ఈ సినిమాను షూట్ చేశాం. ఇందులో పనిచేసిన స్టార్స్ అందరూ తమ సమయాన్ని ఈ సినిమా కోసం డెడికేట్ చేశారు.
మా నిర్మాత వెంకట్ గారు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఆయన ఈ సినిమాను బలంగా నమ్మారు. ఎంత భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మించారో ట్రైలర్లోనే మీకు కనిపిస్తుంది. వెంకట్ గారి ప్యాషన్‌తోనే ఇలాంటి సినిమా సాధ్యమైంది. ఇది చాలా హానెస్ట్ ఫిలిం. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ అంతే హానెస్ట్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా నా భార్య రాధికకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. తన సపోర్ట్ లేకపోతే ఈ సినిమా చేయగలిగేవాడిని కాదు. ఇది చాలా హార్డ్ వర్క్‌తో కూడుకున్న సినిమా. నా కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా ఇది. ఇందులో రెండు, మూడు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తాను. దాని కోసం చాలా సమయం అవసరమైంది. ఆ మొత్తం సమయాన్ని తను చాలా బాగా మేనేజ్ చేసి, నన్ను ఎంతగానో సపోర్ట్ చేసింది. నయనతార చాలా గ్రేస్‌ఫుల్‌గా ఈ సినిమాలో నటించారు. ఆమె లేడీస్ సూపర్‌స్టార్. ఆమె ఎంత బిజీగా ఉంటారో మనందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ సినిమా కోసం ఎంతో అంకితభావంతో పనిచేశారు. తన బెస్ట్ ఇచ్చారు.
ఇందులో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. అందరి పాత్రలకు సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. తారా, హుమా కూడా చాలా అద్భుతంగా నటించారు. వారిని చూసి మేమంతా గర్వపడేలా చేశారు. కియార సినిమాను చాలా బాగా అర్థం చేసుకుని పనిచేశారు. కచ్చితంగా ఆమె పాత్రను ప్రేక్షకులు అభినందిస్తారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నా జర్నీలో మీరు నాకు ఎంతగానో సపోర్ట్‌గా నిలిచారు. నేను ఇండియన్ సినిమాకు ఒక కార్మికుడిలా పనిచేస్తాను. నా బెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తాను. ‘టాక్సిక్’ కచ్చితంగా మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. లవ్ యూ ఆల్”
నిర్మాత కేవీఎన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గారు ఈ వేడుకకు రావడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా సినిమాలో పనిచేస్తున్న నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా డిస్ట్రిబ్యూటర్స్‌కి, మా కొలాబరేటర్స్కి అందరికీ థాంక్యూ. చాలా ప్రతిష్టాత్మకమైన సినిమా ఇది. చాలా బోల్డ్ విజన్‌తో తెరకెక్కించిన ఈ సినిమాను దర్శకురాలు గీతు మోహన్‌దాస్ గారి విజన్‌తోనే ఇంత అద్భుతంగా రూపొందించగలిగాం. నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా అద్భుతంగా నటించారు. రవి బస్రూర్ మ్యూజిక్‌తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. రాకింగ్ స్టార్ యశ్ లేకపోతే ఈ సినిమా సాధ్యపడేది కాదు. ఆయన చాలా ప్యాషన్‌తో, హార్డ్ వర్క్‌తో పనిచేశారు. ఆయన ఎక్సలెంట్ యాక్టర్ మాత్రమే కాదు.. సినిమాలో రైటర్‌గా, కో-ఆపరేటివ్‌గా కూడా పనిచేశారు. ఆయనతో కలిసి పనిచేయడం నిర్మాతగా నాకు చాలా ఆనందాన్నిచ్చింది. నాకు ఇదొక మెమొరబుల్ జర్నీ. ఈ సినిమా అన్ని తరాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. దేశాల సరిహద్దులు దాటి ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందని నమ్ముతున్నాను. గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌పై ఈ సినిమా ఇండియన్ సినిమాను మరింత ఎలివేట్ చేస్తుంది.ఈ సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు”
హుమా ఖురేషి మాట్లాడుతూ.. నేను ఎక్కడికి వెళ్ళిన ఈ సినిమా గురించే అడుగుతున్నారు. ఈ సినిమాలో భాగం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ట్రైలర్ చూస్తుంటే మెస్మరైజింగ్‌గా అనిపించింది. యష్ అద్భుతమైన యాక్టర్. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్‌లో భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
కియారా అద్వానీ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ట్రైలర్ చూసిన తర్వాత అద్భుతంగా అనిపించింది. ఈ సినిమాలో నన్ను భాగం చేసిన గీతు గారికి, యశ్ గారికి థాంక్యూ. నా కెరీర్లో ఈ సినిమా చాలా స్పెషల్. ‘బిఫోర్ టాక్సిక్, ఆఫ్టర్ టాక్సిక్’ అని తప్పకుండా అంటారు. ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మీరు బిగ్ స్క్రీన్‌పై ఒక అద్భుతమైన మ్యాజిక్‌ను చూస్తారు. అందరికీ థాంక్యూ”
రుక్మిణి వసంత్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. చాలా అద్భుతమైన నటీనటులతో కలిసి ఈ సినిమాలో పనిచేసే అవకాశం దొరకడం చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చి ప్రోత్సహించిన దర్శకురాలు గీతు గారికి థాంక్యూ. ఈ సినిమా ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇది నాకు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్. యశ్ నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. వెంకట్ గారు చాలా అద్భుతంగా ఈ సినిమాను నిర్మించారు. ఆయన నిర్మాణంలో మరెన్నో సినిమాల్లో పనిచేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాను థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి.
నయనతార మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ‘టాక్సిక్’ నాకు చాలా స్పెషల్ ఫిలిం. నన్ను ఈ సినిమాలో భాగం చేసిన నిర్మాత కేవీఎన్ గారికి థాంక్యూ. ఆయనతో కలిసి మరెన్నో సినిమాలు చేయాలని ఉంది. రుక్మిణి, తారా, హుమా, కియారా అందరికీ థాంక్యూ. వారితో కలిసి నటించడం చాలా ఆనందంగా అనిపించింది. నేను గీతుతో కలిసి గతంలో ఒక సినిమా చేశాను. కానీ ఇప్పుడు గీతు పూర్తిగా వేరుగా కనిపించారు. ఈ సినిమా కథను ఆమె మైండ్ బ్లోయింగ్‌గా చెప్పారు. సినిమా మొత్తంలో ఆమె ప్రతి ఒక్కరికీ ఎంతో సపోర్ట్‌గా నిలిచారు. నేను చాలా మంది సూపర్‌స్టార్స్‌తో కలిసి పనిచేశాను. యశ్‌తో కలిసి పనిచేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా కోసం ఆయన నాలుగేళ్ల పాటు తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన చాలా హార్డ్ వర్కింగ్ యాక్టర్. దర్శకులు, నిర్మాతలంటే ఆయనకు ఎంతో గౌరవం. ఆయనపై నాకు చాలా గౌరవం ఉంది. ఖచ్చితంగా మీరు ఈ సినిమాను లవ్ చేస్తారని నమ్ముతున్నాను.
దర్శకురాలు గీతు మోహన్‌దాస్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. కేవీఎన్ గారికి థాంక్యూ. ఆయన వల్లే ఈ సినిమా సాధ్యమైంది. మా కోసం ఎక్కడా రాజీ పడకుండా అన్ని సమకూర్చారు. మాపై పెట్టుకున్న నమ్మకానికి ధన్యవాదాలు. మా ప్రొడక్షన్ టీమ్‌కి, డైరెక్షన్ టీమ్‌కి, నటీనటులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వాళ్లందరి హార్డ్ వర్క్ వల్లే ఈ సినిమా సాధ్యపడింది. యశ్ వండర్ఫుల్ యాక్టర్. ఆయన బ్రిలియంట్ ప్రొడ్యూసర్, అద్భుతమైన కో-రైటర్ కూడా. యష్ నాకు పెద్ద ఎమోషన్. ఈ జర్నీని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. గ్రాండ్ గా జరిగిన ఈ వేడుకలో సినిమా యూనిట్ అందరూ పాల్గొన్నారు.
What do you feel about this post?
Like
Love
Happy
Haha
Sad
