చల్ మన్ వృందావన్ సంస్థ ఆధ్వర్యంలో, రాధాకృష్ణ అకేషన్స్ సహకారంతో నిర్వహించిన “అచ్యుత గోపి లైవ్ స్పిరిచ్యువల్ కాన్సర్ట్” సెప్టెంబర్ 20న హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో హెచ్‌ఐసీసీ – నోవోటెల్ (ఎమ్‌ఆర్1) వేదికగా విజయవంతంగా జరిగింది. ప్రఖ్యాత ఆధ్యాత్మిక గాయని అచ్యుత గోపి తన ఆత్మవంతమైన గీతాలు, భక్తిపూరిత సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
నోవాటెల్లో నిర్వహించిన వర్చువల్ మీడియా సమావేశంలో ఆధ్యాత్మిక గురువు అచ్యుత గోపి (Acyuta Gopi) మాట్లాడుతూ, భగవద్గీత గొప్పతనం, భాగవతం, భగవద్గీత గొప్పతనం, భారత సంప్రదాయం, సంస్కృతి గొప్పదనం గురించి వివరించారు. హైదరాబాద్కి రావడానికి చాలా ఉత్సాహంగా ఉన్నానన్నారు. చల్మన్ వృందావన్ చేస్తున్న సేవాకార్యక్రమాలు గురించి వివరించారు. కృష్ణ ఎంచుకున్న ప్రజల మధ్య జీవిస్తున్నందుకు సంతోషంగా ఉందని, తన జీవితంలోకి వెలుగు తెచ్చిన కృష్ణ, గోవింద అంటే ఎప్పటికీ తనకు అపార భక్తిభావం అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజల్లో భక్తిభావం వెల్లివిరుస్తుందని, హైదరాబాద్లో కాన్సెర్ట్ చేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానన్నారు. రాధాకృష్ణుల జీవితంలోని గొప్పవిషయాలు, నేర్చుకోదగిన విషయాలను వివరించారు. మరో పదిహేను రోజుల్లో తెలుగు ప్రజలను కలుస్తానన్నారు.
అచ్యుత గోపి భారతదేశ యాత్ర సందర్భంగా తన అమృతగానంతో అక్టోబర్ 4న హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో జరిగే కార్యక్రమంలో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ ఈవెంట్ ఆధ్యాత్మికత, సంగీతం కలగలిసిన మరో మరపురాని అనుభవాన్ని అందించనుంది. అక్టోబర్ 4న జరిగే కాన్సర్ట్ టికెట్లు డిస్ట్రిక్ట్ బై జొమాటోలో అందుబాటులో ఉన్నాయి. మీరూ ఈ ఆధ్యాత్మిక యాత్రలో భాగం అవ్వాలంటే వెంటనే టికెట్స్ బుక్ చేసేయండి.

Hi, this is a comment.
To get started with moderating, editing, and deleting comments, please visit the Comments screen in the dashboard.
Commenter avatars come from Gravatar.