సంతకం మరచితే…
ఆ సంతకమే ఔతుంది –
మన నిష్కక్రమణకు నాంది..
అందుకే జర జాగ్రత్త సుమా…

ప్రభుత్వ కార్యాలయ గుమ్మం చేరగానే,నీకు ఆహ్వానం పలికి
నీకు గుర్తింపునిస్తుంది.

మన జీవితానికి వెలుగు సంతకం కదా,
ఉద్యోగి కలల చిరునామా కదా,
మరి ఎందుకా అలసత్వo, ఎందుకా నామోషి?

పక్క సెక్షన్‌కు నడిచి వెళ్లి,
రిజిస్టర్‌ పుటను తాకి,
కృతజ్ఞతతో చేతితో పెట్టే ఆ ఒక్క క్షణం,
మన అదృష్టానికి నమస్కారం.

ఆ ఒక్క సంతకం –
నీ బ్రతుకు ఆలంబన
ఆ సంతకమే నీకు జీతం ఇచ్చి.
పిల్లల భవిష్యత్తుకు ఆధారమై
నీ గుండె ధైర్యానికి తో డవుతుంది

జలపాతంలా జాలువారే సోయగం
పంట పొలంలా పండే భరోసా
ఆరోగ్యానికి అండ,
ఆర్థిక బలానికి ఊపిరి,
ఎందరి కన్నీళ్లనో తుడిచే మమత,
మన ఎదుగుదలకు నిలువెత్తు నిదర్శనం,

దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చాడు,
దివ్యాంగులం కాదు మనం
అందుకే…
సంతకాన్ని గౌరవించుదాం
మనo సంతకం కోసం వెళ్లడం ధర్మం
మన దగ్గరకు సంతకం రావాలనడం అధర్మం
మనసుతో చేసే సంతకం మన ఆత్మ గౌరవం
మన జీవితానికి సార్థకత నిచ్చే ఆయుధం సంతకం

ఇకనైనా మారాలి మనం,
నడవాలి మన బాధ్యత వైపు,
నడ వాలి మన విధి నిర్వహణ వైపు.

ఇట్లు ప్రేమతో…
సహ ఉద్యోగిని
జి హేమలత రెడ్డి

ఇట్లు ప్రేమతో…
సహ ఉద్యోగిని
జి హేమలత రెడ్డి

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *