Bay Area: కాలిఫోర్నియాలో 20 వేల మందితో గణేష్ చతుర్థి ఊరేగింపు

ఫోర్నియాలోని శాన్ రామన్ బిషప్ రాంచ్ సిటీ సెంటర్‌లో జరిగిన గణేష్ చతుర్థి వేడుకలకు (Ganesh Festival) 20,000 మందికిపైగా హాజరయ్యారు. నమస్తే బే ఏరియా, బోలీ 92.3ఎఫ్ఎం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో 100 మందికి పైగా ఢోల్-తాషా డ్రమ్మర్లు, భక్తి డ్యాన్సులు, గంటకోసారి హారతులతో గణేష్ ఊరేగింపు వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో (Ganesh Festival) అలమెడ కౌంటీ సూపర్‌వైజర్ డేవిడ్ హౌబర్ట్, శాన్ రామన్ మేయర్ మార్క్ ఆర్మ్‌స్ట్రాంగ్, డబ్లిన్ మేయర్ షెర్రీ హు, మిల్పిటాస్ మేయర్ కార్మెన్ మోంటానో, శాన్ రామన్ వైస్ మేయర్ శ్రీధర్ వెరోస్, మిల్పిటాస్ ప్లానింగ్ కమిషనర్ దీపక్ అవస్తీ, ఎస్ఆర్‌వీయూఎస్‌డీ (SRVUSD) బోర్డు సభ్యులు సుసన్నా ఆర్డ్‌వే, శాన్ రామన్ కౌన్సిల్ సభ్యులు రిచర్డ్ ఆడ్లర్, సిలికాన్ వ్యాలీ ఆసియన్ అసోసియేషన్‌కు చెందిన కాథీ జు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ ఉత్సవానికి (Ganesh Festival) గ్రాండ్ స్పాన్సర్‌గా సంజీవ్ గుప్తా సీపీఏ ఉండగా.. రియల్టర్ నాగరాజ్ అన్నీయా మద్దతుగా నిలిచారు. ఎకో పార్టనర్‌గా ఎర్త్ క్లీన్స్, మార్కెట్ స్పాన్స‌ర్‌గా విజేత సూపర్ మార్కెట్, గోల్డ్ స్పాన్సర్లుగా రేణు-బయోమ్, శ్రీ శివ సాయి, సిల్వర్ స్పాన్సర్లుగా రియల్టర్ శికా కపూర్, ఇన్‌స్టా సర్వీస్, మైపుర్సు, దీక్ష అండక టూ మెయిడ్స్ సేవలందించారు. అమృత విలాస్ లడ్డూ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈ వేడుకల్లో (Ganesh Festival) వందశాతం బంకమట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాన్నే ఉపయోగించారు. ఇది బే ఏరియాలోనే అతిపెద్ద వినాయక ఊరేగింపు కావడం గమనార్హం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *